Type to search

అఖిల్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్”?

Box Office Latest News Trenging News

అఖిల్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్”?

బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ దర్శకత్వంలో అక్కినేని మూడో త‌రం న‌ట వార‌సుడు అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతోన్న సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగం గా జరుగుతోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. అఖిల్, పూజ హెగ్డే జంటగా వస్తోమ్మ తొలి చిత్రం ఇది. 7ఏళ్ల క్రితమే సినిమాలలోకి వచ్చిన అఖిల్ … అఖిల్‌, హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌లించ‌లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల‌ని అఖిల్ త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌కి కూడా హిట్ అవ‌స‌రం.
యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్నఈ సినిమా టైటిల్‌ను ఫిబ్ర‌వ‌రి 4న సాయంత్రం 5.15 కు అనౌన్స్ చేయ‌బోతున్నారు. ఈ సినిమాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశార‌ని రూమర్లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ సినిమా టైటిల్ ఎంతో తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాల్సిందే

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *