Type to search

అక్కడ కూడా అదరగొట్టనున్న యాంకర్ అనసూయ !

Box Office Latest News Trenging News

అక్కడ కూడా అదరగొట్టనున్న యాంకర్ అనసూయ !

ఒక వైపు టీవీ షో లలోను మరో వైపు సినిమాలోనూ బిజీగా ఉన్న హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్. రంగస్థలం సినిమాలో రంగమత్త గా నటించిన అనసూయ నటనతో మెప్పించి మరిన్ని ఆఫర్లు దక్కించుకుంది. అంతే కాకుండా బడా హీరోలు సైతం ఈ బ్యూటీతో చిందులు వేయడానికి ఇష్టపడ్డారు. ఇక ఇప్పుడు ఈ భామ బాలివుడ్ లోకి కూడా అడుగు పెట్టేస్తోంది. అయితే బాలివుడ్ లో ఎంట్రీ ఇచ్చేది సినిమాలోకి కాదు సీరియల్స్ లోకి. బాలీవుడ్ సీరియల్స్ ఓ ఛాన్స్ కొట్టేయడం కూడా సాధారణ విషయం కాదు ఎంతో మంది తెలుగు హీరోయిన్స్ ఇప్పుడు హిందీ సీరియల్స్ లో నటిస్తున్నారు. దీనికి కారణం హిందీ సీరియల్స్ కి మన దేశం లో అన్ని రాష్ట్రాలతో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్ లో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అయితే అనసూయను హిందీ లోని ఓ ఫేమస్ సీరియల్ లో నటించమని నిర్వాహకులు సంప్రదిస్తున్నారట. ఇక ఇదే నిజమైతే హాట్ బ్యూటీ సీరియల్స్ లో ఎలా పేరు తెచ్చుకుంటుందో చూడాలి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *